ETV Bharat / state

Siddipet: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి - Siddipet District News

swim
swim
author img

By

Published : May 4, 2023, 5:55 PM IST

Updated : May 4, 2023, 6:50 PM IST

17:51 May 04

సిద్దిపేట జిల్లాలో చెరువులో పడి ముగ్గురు మృతి

Siddipet: బంధువుల ఇంట్లో ఆనందంగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో చివరికి విషాదం మిగిలింది. హైదరాబాద్ యాకుత్​పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్న కుమారుడు షేక్ ముస్తఫా (3), మరో బంధువు షాపూర్​కు చెందిన మహమ్మద్ సోహెల్ (17)లు బుధవారం కుటుంబసభ్యులతో కలిసి.. గజ్వేల్ మండలం మక్త మాసాన్​పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం అందరూ కలిసి వర్గల్ మండలం నెంటూరు సామలపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు వద్దకు వెళ్లగా.. చిన్న బాబు అయిన ముస్తఫా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు షేక్ కైసర్, సోహెల్ ఇద్దరూ చెరువులోకి దిగారు. ఈ ఇద్దరికీ ఈత రాకపోవడంతో.. బాలుణ్ని రక్షించే క్రమంలో వీరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు లబోదిబోమంటూ రోధిస్తుండటంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు వచ్చి ఈతగాళ్ల సహాయంతో నీట మునిగిన ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే వారు మృతి చెందారు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

women died: ఊరు కాని ఊరు వెళ్లి.. చివరకు శవమై మిగిలి

Girl falls in nala: పాల ప్యాకెట్​ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు

Last Updated : May 4, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.