కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెంకటేశ్వర ఆలయంలో విక్రయించారు. లాక్ డౌన్ కారణంగా శ్రీవారిని దర్శించుకో లేకపోతున్న నేపథ్యంలో.. భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఒక లడ్డూ రూ.25లు
దీనిలో భాగంగానే గజ్వేల్ ఆలయ నిర్వాహకులు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ కార్యాలయం నుంచి 5వేల లడ్డూలను తీసుకువచ్చారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఒక లడ్డూ రూ.25 చొప్పున విక్రయించినట్లు అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. శ్రీవారి ప్రసాదాల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు గంటల వ్యవధిలోనే 5వేల లడ్డూలు విక్రయించారు.
ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న