దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్‌కుమార్... పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని విమర్శించారు.
బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ... ప్రజల వాణిని వినిపించడంలో పార్లమెంట్లో విఫలమైందన్నారు. హుస్నాబాద్‌ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత తెరాసదేనని వినోద్ వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించడానికి మరింత విశేషంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను వినోద్‌కుమార్ కోరారు.
ఇవీ చూడండి: మహిళలే ఎక్కువ చక్కెర ఆరగించేస్తున్నారట!