సిద్దిపేట జిల్లా గజ్వేల్ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న బొమ్మ యాదగిరి పట్టణంలోని బీడీ కాలనీలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి సొంత గ్రామం వర్గల్ మండలం గుంటుపల్లికి వెళ్లాడు తిరిగి మంగళవారం మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.
ఇంట్లో చొరబడిన దొంగలు బీరువా తాళాలు ధ్వంసం చేసి 6 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రజ్ఞాపూర్‌లో ఏటీఎం చోరీ కేసు మరవకముందే మరో దొంగతనం జరగడం వల్ల పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేయాలని పలువురు కోరారు.
ఇవీ చూడండి:ప్రైవేట్‌లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్