వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చిరుజల్లులు కాస్త ఉపశమనం ఇచ్చాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిప్పులు కురిపించిన భానుడు.. సాయంత్రానికి చల్లబడ్డాడు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తొగుట మండలంలో సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆకాశం మేఘావృతమైంది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు చిరుజల్లుల వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. మిగిలిన ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. పొలం దుక్కులు దున్నుకోవడానికి వర్షపు చినుకుల అనుకూలంతో అన్నదాత పొలంబాట పట్టనున్నారు. ఈ సీజన్ ఆశాజనకంగా ఉండాలని రైతులు కోటి ఆశలతో ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.
ఇదీ చూడండి: పండించిన పంటలకు.. రైతే మద్దతు ధర నిర్ణయించాలి..