సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామాన్ని పాలనాధికారి వెంకట్రామి రెడ్డి సందర్శించారు. రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా హబ్సీపూర్లో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులు ఉండకూడదని, వేలిముద్ర పెట్టేవారు సంతకాలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
ఇందుకోసం గ్రామాల్లోని విద్యావంతులు... గ్రామాధికారులు చదువులేని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. గొర్రెలు, మేకల కోసం బయట స్థలం సేకరించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచుతూ... ఆదర్శ గ్రామంగా తయారు చేసుకోవాలని తెలిపారు.
ఇవీ చూడండి : 'మేడ్చల్, గుండ్లపోచం పల్లిలో కాంగ్రెస్ విజయం ఖాయం'