సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి శివారులో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను లారీ ఢీ కొట్టంది. చెట్లు ద్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రూ. 12వేలు జరిమానా విధించారు. ఆ డబ్బులను మున్సిపల్ అకౌంట్లో జమ చేశారు.
హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం మొక్కల భద్రత విషయంలో అందరూ సహకరించి హరిత సిద్దిపేటలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా హరితహారం అధికారి ఐలయ్య కోరారు.
ఇదీ చూడండి : 2018లో ఆర్టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం