KOMURAVELLI TEMPLE: సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామికి... రాష్ట్ర ప్రభుత్వం బంగారు కిరీటాన్ని సమర్పించనుంది. స్వర్ణ కిరీట నమూనాను హైదరాబాద్లో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాలకు ఆదరణ... అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లన్న... పల్లె జాతర, పల్లె ప్రజలకు ఎంతో ప్రాశస్త్యమైందని అన్నారు. మల్లన్న స్వామికి 4 కోట్ల రూపాయల వ్యయంతో... ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన చేపిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. వచ్చే 2 నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: World Water Day: 'నీటి వినియోగం, పొదుపులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ'