సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నగరంలోని సమీకృత మార్కెట్లో 'వి మార్ట్ సూపర్ మార్కెట్' ను ప్రారంభించారు. ఒకే ప్రాంతంలో శాఖాహార, మాంసాహార పదార్థాలు లభించే విధంగా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మాంసాహార ఉత్పత్తులతో పాటు పప్పు దినుసుల సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు పిలుపునివ్వడంతో అందుకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఆహార ఉత్పత్తులు మంచి నాణ్యతతో పాటు, తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: స్థానిక సంస్థల తొలి విడత పోలింగ్ ప్రారంభం