హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్‌కు చెందిన కృష్ణ కుటుంబ సభ్యులతో సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బంధువుల ఇంటికి బయలు దేరారు. రాజీవ్ రహదారిపై ములుగు సమీపంలో కంటైనర్ లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. కారు ముందుభాగం లారీ కింద ఇరుక్కుపోయింది. సుమారు కిలోమీటర్ దూరం కారును లాక్కుపోయింది. ఇది గమనించిన స్థానికులు లారీని వెంబడించి ఆపేశారు. అనంతరం గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: మినీ శిల్పారామం... నగరవాసులకు ఆహ్లాదం