ETV Bharat / state

దుబ్బాక ఎన్నిక వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత - Tension once again in Siddipet

దుబ్బాక ఉపఎన్నికల వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భాజపా, తెరాస నేతల మధ్య ఘర్షణ, తోపులాటతో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తెరాస ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ స్వల్పంగా గాయపడగా, మాజీ ఎమ్మెల్యే వీరేశం డ్రైవర్‌, తెరాస నేత సైదులు చేతికి గాయమైంది. ఈ ఘటన సిద్దిపేటలోని ఓ లాడ్జిలో చోటుచేసుకుంది. ప్రజాదారణ చూసి తట్టుకోలేకే భాజపా దాడులకు దిగుతోందని తెరాస ఆరోపించింది. అధికార దుర్వినియోగంతో ఉపఎన్నిక్లలో గెలవాలని అధికారపార్టీ చూస్తోందని భాజపా ఆక్షేపించింది.

దుబ్బాక ఎన్నిక వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత

author img

By

Published : Nov 3, 2020, 5:03 AM IST

దుబ్బాక ఉపసమరం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా, తెరాస నేతలు మరోసారి ఘర్షణకు దిగడం సిద్దిపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన ఘర్షణ, తోపులాటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్వల్పంగా గాయపడ్డారు.

దాడికి యత్నం...

తాము భోజనానికి కూర్చుంటున్న క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి వారి అనుచరులు మద్యం మత్తులో తనవైపు దూసుకొచ్చారని క్రాంతికిరణ్‌ తెలిపారు. ఒకానొక దశలో దాడికి సైతం యత్నించారని చెప్పారు. దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేని పరిస్థితి ఉందని, భాజపా గెలిస్తే పేదలకు రక్షణ ఎలా ఉంటుందని క్రాంతి కిరణ్‌ ప్రశ్నించారు.

దర్యాప్తు చేపట్టండి...

తెరాస నేతలు దుబ్బాక ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో నిఘా పెట్టేందుకు లాడ్జి వద్దకు వెళ్లినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మమ్మల్ని చూసి దుర్భాషలాడారని ఆరోపించారు. ఎమ్మెల్యేనే తొలుత తన చేతిని పట్టుకున్నారని, తర్వాత ఆయన అనుచరులు దాడికి దిగారని ఆరోపించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. …

ఓర్వలేకే...

తెరాసకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే భాజపా నేతలు తమ పార్టీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులపై దాడికి దిగారని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. భాజపా నేతలు పథకం ప్రకారమే లాడ్జికి వెళ్లి భౌతిక దాడికి దిగారని, ఇది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉంటున్న హోటల్‌ గదికి వచ్చిన భాజపా నేతలు తనిఖీల పేరిట ఇబ్బంది పెట్టడం దారుణమని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అడ్డదారుల్లో...

దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతోనే తెరాస అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. అర్ధరాత్రి దుబ్బాక కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని తెరాస సర్కార్‌ ఖూనీ చేసిందని ఆక్షేపించిన సంజయ్‌ అధికార పార్టీయే డబ్బులు పంపిణీ చేస్తూ తమపై నిందలు వేయడం దారుణమని వ్యాఖ్యానించారు.

విచ్చలవిడిగా నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు హోటళ్లలో అధికార దుర్వినియోగం చేస్తుంటే.. పోలీసు యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని ప్రశ్నించారు. డబ్బులు పంపిణీ చేస్తున్న వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.