రైతును రాజుగా చూడలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యునిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధికంగా కృషి చేస్తోందని ప్రతాప్‌రెడ్డి అన్నారు. కర్కపట్ల గ్రామంలో నిర్మించిన ఎస్సీ భవనంతో పాటుగా దామరకుంటలో రైతువేదిక, మర్కుక్ మండల కేంద్రంలో మహిళ సంక్షేమ భవనాన్ని జడ్పీటీసీ ఛైర్‌పర్సన్ రోజా శర్మతో కలిసి ప్రారంభించారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
ఇదీ చదవండి: త్వరలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు