ETV Bharat / state

కరోనా కాలంలో పేదలకు అండగా స్వామి సమర్థ ఆశ్రమం

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచికోడ్ శివారులో.. స్వామి సమర్ధ ఆశ్రమం నెలకొల్పినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఆశ్రమ నిర్వాహకుడు నరసింహాచారి తెలిపారు. ఆశ్రమం ఆధ్వర్యంలో పేదకుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.

swamy samartha ashramam in siddipet district helps needy
దుబ్బాక మండలంలో స్వామి సమర్థ ఆశ్రమం
author img

By

Published : Sep 21, 2020, 11:13 AM IST

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచికోడ్ శివారులోని స్వామి సమర్థ ఆశ్రమ నిర్వాహకుడు నరసింహాచారి అన్నారు. లాక్​డౌన్​ సమయంలో ఆశ్రమం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యాన్నదాన సదుపాయం కల్పించామని తెలిపారు.

లాక్​డౌన్ నిబంధనలు సడలించినా.. ఉపాధి లేక కష్టాలు ఎదుర్కొంటున్న నిరుపేదలకు.. ఆశ్రమం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఆశ్రమంం నెలకొల్పినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని నరసింహాచారి చెప్పారు. ఇటీవలే నిజామాబాద్​లో సుమారు 100కు పైగా కుటుంబాల మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి చేయూతనందించామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.