సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన గడ్డం రాజు తమ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ తరుణంలో రాజు కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న చిన్నకోడూరు మండలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రాజు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి : శ్రీ కృష్ణుడు కట్టుకున్న రాఖీ పుష్పం.. హుస్నాబాద్‌లో పూసింది!