పాఠశాల సమయాల్లో టిప్పర్ల రాకపోకలను నిలిపి వేయాలంటూ... సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
పాఠశాల సమయాల్లో టిప్పర్ల రాకపోకలను నిలిపి వేయాలని... మితిమీరిన వేగంతో టిప్పర్లు తిరుగుతుండటం వలన భయభ్రాంతులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం అధికారులకు, ఎస్సై శ్రీనివాస్‌లకు వినతి పత్రం అందజేశారు.
ఇవీచూడండి: 'ఒక్కరు కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా...'