ETV Bharat / state

స్పానిష్​ ఫ్లూ కంటే కరోనా ప్రమాదకరం : వినోద్​కుమార్​

భారతదేశంలో కోటి అరవై లక్షల మందిని పొట్టన పెట్టుకున్న స్పానిష్​ఫ్లూ కంటే కరోనా ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరోనా నివారణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

వినోద్​కుమార్​
వినోద్​కుమార్​
author img

By

Published : Apr 24, 2020, 5:42 AM IST

కరోనా నివారణ చర్యలపై రోజూ 15 నుంచి 16 గంటల పాటు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరోనా నివారణ, ధాన్యం కొనుగోళ్లపై స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్​తో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

ప్రజలందరూ సంవత్సరం పాటు మాస్కులు ధరించి... భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొంటున్నదని చెప్పారు. దీనికోసం రూ. 25 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీ ఒక సంవత్సరంలో పూర్తవుతుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ బిడ్డలు సైతం పాల్గొనే అవకాశం ఉందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.