సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పట్టణంలోని గంజి మార్కెట్-పాత చేపల మార్కెట్ ఏరియాలో పర్యటించిన మంత్రి రోడ్డుపై చెత్తా చెదారం పేరుకొని ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే డంపు యార్డును తలపించేలా చెత్త పోగవుతున్నా.. చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
వెంటనే ఆ ప్రాంతంలోని చెత్తను తొలగించి.. మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం చెత్త వాహనాల వెంట వీధివీధిలో కలియతిరుగుతూ తడి, పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్