సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన నెక్లెస్ రోడ్డును మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో సిద్ధిపేట జిల్లాను అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా మార్చమన్నారు. 15 కోట్ల రూపాయలతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ , సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు.
రూ.2.50 కోట్లతో త్వరలోనే ఫుట్ బాల్ కోర్ట్‌తో పాటు వాలీబాల్ అకాడమిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపు రూ.25 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్‌లతో నరవణే భేటీ