సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వాసవినగర్లో శుక్రవారం రాత్రి శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. మేళతాళాల నడుమ మూడు గంటల పాటు కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మహిళలు దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!