ETV Bharat / state

Veera Bairanpally: వీరుల తల్లి.. బైరాన్‌పల్లి నరమేధానికి 73 ఏళ్లు

తెల్లదొరలను తరిమిన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. పరాయి పాలకులు దేశాన్ని వదిలి సంవత్సరం గడుస్తున్నా.. నిజాం ప్రాంతంలో స్వేచ్ఛకు తావు లేదు. రోజురోజుకు నిజాం నిరంకుశత్వం పెరుగింది. ప్రజల మానప్రాణాలకు కనీస విలవ లేకుండాపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల రాక్షసత్వం నుంచి తమను తాము కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బైరాన్​పల్లి కూడా ఇటువంటిదే. కానీ దాని నేపథ్యం.. చరిత్ర విభిన్నం. బైరాన్​పల్లి అమరుల త్యాగానికి 73 ఏళ్లు ముగుస్తున్న సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Veera bairanPalli
Veera bairanPalli
author img

By

Published : Aug 27, 2021, 7:41 AM IST

వీరుల తల్లి.. బైరాన్‌పల్లి నరమేధానికి 73 ఏళ్లు

బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవడంతో భారతదేశం స్వాంతంత్య్రం పొందింది. నిజాం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్​లో కలపడానికి నిరాకరించాడు. తనని స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని పాలన కొనసాగించాడు. ప్రజల్లో స్వేచ్ఛాకాంక్ష పెరగడంతో.. మరింత నిరంకుశంగా వ్యవహరించాడు. దీనికి తోడు నిజాం సైన్నికాధికారి కాశీం రజ్వి వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు పెచ్చిమీరి పోతున్నాయి. ప్రజల ఆస్తులతో పాటు మానప్రాణాలను దోచుకుంటున్నారు.

గ్రామ రక్షక దళాలు ఏర్పాటు

ఇలాంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యునిస్టు పార్టీ... పల్లెల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసింది. చురకైన యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి వారిని సాయుధులుగా మార్చింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్​పల్లిలోనూ బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది.

గ్రామాన్ని రక్షించుకోడానికి ఐక్యంగా

రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్​పల్లి గ్రామస్థులంతా ఐక్యమయ్యారు. శుత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్ నిర్మాణం చేసుకున్నారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు.. నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. బైరాన్​పల్లికి సమీపంలో లింగాపూర్ గ్రామంపై రజాకార్లు దాడి చేసి ప్రజలను దోచుకోని వెళ్తున్నారు. దీన్ని గమనించిన బైరాన్​పల్లి గ్రామ రక్షక దళం వారిపై దాడి చేసి.. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి దానిని ప్రజలకు పంచిపెట్టారు.

మూడుసార్లు దాడి

దీంతో రజాకార్ల బైరాన్​పల్లిపై ప్రతికారేచ్చతో రగిలిపోయారు. తమ కక్ష తీర్చుకోవడం కోసం గ్రామంపై దాడి చేశారు. గ్రామ రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికి పైగా రజాకార్లు చనిపోయారు. రెండోసారి దాడి చేసిన రజాకార్లు గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో కాసీం రజ్వీ పర్యవేక్షణలో మూడోసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో 27-08-1948 తెల్లవారుజామున గ్రామంపై దాడి చేశారు. కోట బూర్జుపై ఫిరంగులతో దాడి చేశారు. ఈ దాడిలో బూర్జులోని ఓ గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామగ్రి పేలిపోవడంతో పాటు.. దానిపై నుంచి దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు చనిపోయారు. దీంతో గ్రామం రజాకార్ల హస్తగతమైంది.

'ఆ రోజు జరిగిన చరిత్ర చూస్తనే తప్ప చెప్తే ఒడవది. మాపై మూడుసార్లు దాడి జరిగింది. రాత్రి 1 తర్వాత వచ్చి దాడి చేశారు. రజాకార్లు కాదు. పోలీసు వాళ్లే. ఇక వాళ్లు ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. తిట్టారు. ఆడవాళ్లు బురుజు దగ్గర బట్టలు విడిపించి బతుకమ్మ ఆడించారు. లెంకలు పెట్టి చంపిండ్లు. ఐదు గంటల దాకా సాధించి అప్పుడు వెళ్లిండ్లు.'

- కొమురయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు.

ఆకృత్యాలు

బైరాన్​పల్లిని తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత రజాకార్ల ఆకృత్యాలకు అంతు లేకుండాపోయింది. రక్తాన్ని ఎరులై పారించారు. 96 మంది యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలను చేసి ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలు చేశారు. రజాకార్ల చిత్ర హింసలు తట్టుకోలేక కొందరు స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. నాటి ఘటనలు గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

'కోల్లాగలను కట్టేసినట్లు కట్టేసినట్లుగా దండరెక్కలు కట్టి.. తాళ్లు కట్టి చంపిళ్లు. మత్తు బాధ పెట్టి... ఇబ్బంది పెట్టి... వాళ్లు ఎట్ల చేయమంటే అట్ల చేసినం. బతుకమ్మలు ఆడించిండ్లు. మానభంగాలు చేసిండ్లు. వాళ్లు ఏది చెప్పినా చేయవల్సి వచ్చింది. మా వాళ్లంతా మూడు నెలలు బయటకు వెళ్లిండ్లు. బాయికాడ వండుకుని తిన్నరు. మూడు నెలల తర్వాత వచ్చిండ్లు ఇండ్లళ్లకు'

- కనకమ్మ, స్వాతంత్య్ర సమరయోధురాలు

118 మంది వీరమరణం

బైరాన్​పల్లి పక్కనే ఉన్న కూటిగల్లుపైనా అదే సమయంలో దాడి చేసిన రజాకార్లు.. 22 మందిని పొట్టన పెట్టుకున్నారు. రికార్డుల ప్రకారం 118 మంది చనిపోయారని ఉన్నా.. వాస్తవంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని.. ఆ రోజు గ్రామంలో ఎటు చూసినా శవాలే ఉన్నాయని నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. బైరాన్​పల్లి నరమేధం.. భారత ప్రభుత్వం దృష్టికి చేరడంతో.. నాటి హోం మంత్రి వల్లభాయి పటేల్ పోలీస్ యాక్షన్​కు రంగం సిద్ధం చేశారు. ఈ ఘటన జరిగిన 21 రోజుల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్​లో వీలినమైంది.

వీర బైరాన్​పల్లిపై ప్రభుత్వం చిన్నచూపు

నాటి నుంచి బైరాన్​పల్లి.. వీర బైరాన్​పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని స్వతంత్ర సమరయోధులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో భాగస్వామ్యం అవగా.. కేవలం 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారు. నాడు పోరాటంలో పాల్గొని పెన్షన్ రానీ వాళ్లు ఇంకా 20 మంది వరకు ఉన్నారు. కూటిగళ్లులోనూ ఇదే పరిస్థితి. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్థులే ఓ స్థూపాన్ని నిర్మించుకున్నారు.

73వ సంస్మరణ దినం

నాటి పోరాట పటిమకు సాక్షిగా నిలిచిన బూర్జు శిథిలావస్థకు చేరకుంది. దానిపై పెరుగుతున్న చెట్లను తొలగించకపోవడంతో కూలిపోయే స్థితికి చేరుకుటుంది. 73వ సంస్మరణ దినం సందర్భంగా నాడు అసువులు బాసిన 118 మంది అమరుల ఆత్మశాంతి కోసం మాజీ ఎంపీ రాపోలు ఆనంద్​ భాస్కర్ ఆధ్వర్యంలో సమూహిక పితృయజ్ఞం, పిండదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి : 'తెలంగాణ అసెంబ్లీని రేపే రద్దు చేసినా ఆశ్చర్యం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.