సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకుడులో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పర్యటించారు. పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం వివిధ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
అనంతరం పల్లెప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. ఆరోగ్యం, అక్షరాస్యతలో పెద్దచీకుడు వాసులు ముందుండాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ప్రతి ఒక్కరూ.. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి