ETV Bharat / state

పున్నామ నరకం చూపిస్తున్న కొడుకులు! - సిద్ధిపేట కరోనా వార్తలు

గుండెలపై ఆడించి.. లాలించిన తల్లిదండ్రులు భారమైపోతున్నారు. కాలం పగబట్టి.. కరోనా కాటేస్తే.. కడుపున పుట్టినవారే..కానివారై.. కాటికి సాగనంపడానికి కూడా ఆలోచిస్తున్నారు. భుజాలపై ఎత్తుకొని పెంచి పెద్ద చేసిన తండ్రిని.. ముదిమి వయసులో చంటిపాపలా చూసుకోవాల్సిన కొడుకులు ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఆరోగ్యం చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నా.. కన్నెత్తి కూడా చూడలేదు. కొడుకులంటేనే.. కోపం తెప్పిస్తున్న ఈ రెండు ఘటనలు సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకున్నాయి.

sons not done fathers Funeral in siddipet
పున్నామ నరకం చూపిస్తున్న కొడుకులు!
author img

By

Published : Aug 6, 2020, 8:00 PM IST

‘మాయమైపోతున్నాడమ్మ.. మనిషిన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు’ అని ఓ కవి రాసిన పాట సిద్ధిపేట జిల్లాలో జరిగిన పలు ఘటనలు చూస్తే.. నిజమే అనిపిస్తున్నది. కొహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కుమారులు. జీవితాన్ని ధారపోసి కష్టపడి సంపాదించిన రూ. 3కోట్ల విలువైన ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు. 79 సంవత్సరాల దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన కొడుకులు.. కనీసం అన్నం కూడా పెట్టకుండా వదిలేశారు. తండ్రి బాగోగులు చూసుకోవాలని గ్రామ పెద్దలు పలుమార్లు మందలించినా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా.. ఆర్డీవో హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. ఏడాది కాలంగా గ్రామస్థులు పెట్టిన తిండే.. ఆ వృద్ధుడి దిక్కయింది.అయినా.. ఆ కన్నకొడుకుల రాతి గుండెలు కరగలేదు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా..

మల్లయ్య దీనస్థితి తెలుసుకున్న కొహెడ ఎస్సై రాజకుమార్.. ఆయనను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో అనారోగ్యం పాలైన మల్లయ్యను ఆశ్రమ నిర్వాహకులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించింది. గత నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. తండ్రి పరిస్థితిని కొడుకులకు చెప్పగా.. చికిత్స చేయించడం కాదు కదా.. కనీసం ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కన్నతండ్రిని పట్టించుకోని కొడుకులపై శనిగరం వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని హుస్నాబాద్ కోర్టులో హజరు పరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు వారికి రిమాండ్ విధించింది.

తండ్రి శవాన్ని వదిలేసి..

కరోనా లక్షణాలతో చనిపోయిన తండ్రి శవాన్ని ఆస్పత్రిలోనే వదిలేసి.. కన్నతండ్రికిక కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా కొడుకు పారిపోయిన ఘటన జిల్లాలోని శ్రీనగర్​ కాలనీలో చోటు చేసుకుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతుండం వల్ల అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పోందుతూ.. ఆయన మధ్యాహ్నం మృతి చెందారు. మృతదేహాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్యాక్ చేసి.. కుమారుడికి అప్పగించి.. అంబులెన్సులో పెట్టించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్న కొడుకు రాత్రి వరకు తిరిగి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. చివరికి చేసేది లేక.. ఆసుపత్రి సిబ్బంది రాత్రి తొమ్మిది గంటలకు శవాన్ని మార్చురీలోకి తరలించారు. కొడుకు ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జన్మనిచ్చి.. విద్యా బుద్ధులు నేర్పించి.. ఆస్తులు పంచి ఇచ్చిన తల్లిదండ్రులపై కనీసం కనికరం చూపలేని ఇటువంటి కొడుకులనే కనేకంటే.. గొడ్రాలుగా మిగిలిపోవడం ఉత్తమం అంటున్నారు ఈ సంఘటనలు ప్రత్యక్ష్యంగా చూసివ స్థానికులు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.