సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాకు చెందిన గుగులోతు లింగయ్య, వీరమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు నరసింహ నాయక్ సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తూ.. 2014లో చత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్లు పెట్టిన మందుపాతరకు బలయ్యాడు. తల్లిదండ్రులు అతని విగ్రహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసి కొడుకుని విగ్రహంలో చూసుకుంటున్నారు. ప్రతి ఏటా స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా.. సమాధి వద్ద జాతీయ పతాకం ఎగురవేస్తున్నారు.
ఒక్కగానొక్క తమ్ముడి మరణాన్ని అతని సోదరీమణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరుడి విగ్రహానికి రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదని తల్లిదండ్రులు తెలిపారు. చిన్న కూతురు డిగ్రీ వరకు చదివిందని.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఇవీచూడండి: అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత