ETV Bharat / state

కొత్త యంత్రాలు.. సొగసుకు అద్దెను మెరుగులు

ఎలక్ట్రానిక్‌ జకాట్‌ యంత్రం అమర్చిన మరమగ్గంపై ఉత్పత్తి చేసిన చీరలు వస్త్రోత్పత్తుల్లో సూక్ష్మకళలతో అందరి దృష్టిని ఆకర్షించిన పరిశ్రమ.. తిరిగి తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలని తపిస్తోంది. మగువలు మెచ్చే సెమీ పట్టు చీరల ఉత్పత్తిలో కొత్త పుంతలు తొక్కుతోంది. వారసత్వంగా వస్తున్న మరమగ్గాలకు స్వల్ప మార్పులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. ఆధునికత వైపు అడుగులు వేస్తున్న వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం.

sircilla Weavers produce new type of  saree with a new machineries
కొత్త యంత్రాలు.. సొగసుకు అద్దెను మెరుగులు
author img

By

Published : Dec 27, 2020, 1:00 PM IST

స్త్రోత్పత్తి పరిశ్రమలో అరవై శాతానికిపైగా పురాతన మరమగ్గాలున్నాయి. వీటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రుజువు చేస్తున్నారు కొందరు సిరిసిల్ల యువ వస్త్రోత్పత్తిదారులు. ఏడాదిలో గరిష్ఠంగా ఏడు నెలలు ప్రభుత్వ ఆర్డర్లు ఉంటున్నాయి. తర్వాత ఉపాధి సగానికి పడిపోతోంది. ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడకుండా బహిరంగ విపణిలో డిమాండ్‌ ఉన్న చీరల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో 26 వేల మరమగ్గాలను చేనేత, జౌళిశాఖ జియోట్యాగింగ్‌ చేసింది. వాటిలో 11 వేల మరమగ్గాలకు ప్రభుత్వం కల్పించిన రాయితీతో ఆటోమేటిక్‌ మోషన్‌.. డాబీ పరికరాలను అమర్చుకున్నారు. కొందరు యువకులు మరో అడుగు ముందుకేసి సొంత ఖర్చులతో మాన్యువల్‌, ఎలక్ట్రానిక్‌ జకాట్‌లను అమర్చుకున్నారు.

నవ్యతకు నాంది

సాధారణ మరమగ్గానికే హుక్స్‌ (640-940)కు పెంచుకుంటున్నారు. దీంతో చీరలపై ఫొటోలతో ఉత్పత్తి చేయవచ్ఛు జకాట్‌ పరికరం ఏర్పాటుకు రూ.2.75 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. తమకున్న మరమగ్గాల్లో ఒకటి, రెండింటికి ఈ పరికరాన్ని అమర్చుకుంటున్నారు. ఖర్చుతో కూడుకున్నదే అయినా.. ఆర్డర్లతో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని జిల్లాలో ఇప్పుడిప్పుడే పదుల సంఖ్యలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. బతకమ్మ చీరల ఉత్పత్తితో వార్ఫ్‌. వెప్ట్‌లో పాలిస్టర్‌, జరీ అంచులు... వివిధ రకాల డిజైన్లను తయారు చేశారు. ఈ పరికరంతో సిల్క్‌, పట్టు, పాలిస్టర్‌, కాటన్‌లను ఉత్పత్తి చేయవచ్ఛు చీరల ఉత్పత్తితో డిజైన్‌ను బట్టి విపణిలో మంచి ధర లభిస్తుంది.

వస్త్రోత్పత్తి పరిశ్రమ స్వరూపం

జియోట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు : 26,494

ఆధునికీకరించినవి : 15,402

పురాతనమైనవి : 11,092

టెక్స్‌టైల్‌ పార్కులోనివి: 1,500

పని తీరు ఇలా...

తుకమ్మ చీరల ఉత్పత్తితో పరిశ్రమ మొత్తం ముతక రకం నుంచి మేలు రకాల రంగుల చీరల ఉత్పత్తి ప్రారంభమైంది. బతుకమ్మ చీరలు, తమిళనాడు సంక్రాంతి చీరలు, పాఠశాల దుస్తుల్లోనూ డిజైన్లు మారాయి. ఎలక్ట్రానిక్‌ జకాట్‌లో కంప్యూటర్‌లో ఒకేసారి వెయ్యి డిజైన్లను ఎంపిక చేసుకుని మెమోరీ కార్డును పరికరానికి అమర్చుతారు. దీనిలో వాడే నూలు తేలికపాటి పట్టును పోలి ఉంటుంది. విఫణిలో పట్టుచీరల డిజైన్లను పోలి ఉంటుంది. నూలును వార్పిన్‌ నుంచి నేరుగా యంత్రానికి అనుసంధానం చేయవచ్ఛు నాలుగు మగ్గాలకు ఒక కార్మికుడు సరిపోతాడు. కార్మికులపై పని భారంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తికి కార్మికునికి మీటరుకు రూ.8.50 చెల్లించగా.. జకాట్‌పై ఉత్పత్తి చేసే చీరలకు రూ.30 చెల్లిస్తారు.

కంపెనీల దృష్టి ఆకర్షించేలా...

- కుసుమ నర్సింహస్వామి, వస్త్రోత్పత్తిదారుడు

ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లతో జిల్లా పరిశ్రమలోని అన్ని వర్గాలు నైపుణ్యాన్ని అలవర్చుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు, హిందూపూర్‌ల నుంచి వ్యాపారులు నూలుతోపాటు ఆర్డర్లు ఇస్తున్నారు. జిల్లా పరిశ్రమ ఇతర రాష్ట్రాల్లోని టెక్స్‌టైల్‌ కంపెనీల దృష్టిని ఆకర్షించాలి.

ప్రభుత్వం చేయూతనివ్వాలి

- నల్ల విజయ్‌, వస్త్రోత్పత్తిదారుడు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆసక్తితో ఉన్నవారు జిల్లా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. నాకున్న మరమగ్గాల్లో ఒక దానికి రూ. 1.50 లక్షలతో మాన్యువల్‌ జకాట్‌ను అమర్చాను. రూ.7.80 లక్షలతో పూర్తిగా కొత్తది కొనుగోలు చేశాను. ప్రభుత్వం చేయూతనిస్తే చాలా మంది నూతన పరిజ్ఞాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన చీరలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేలా ప్రభుత్వం చొరవ చూపాలి.

ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిస్తున్నాను

- వెల్ది హరిప్రసాద్‌, వస్త్రోత్పత్తిదారుడు

తొలుత సూక్ష్మకళతో తయారు చేసిన చీరలకు న్యూజిలాండ్‌, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. కార్ఖానాలో పట్టుచీరల ఉత్పత్తిని చూసి పలు దేశాల్లోని వారు ముందస్తు ఆర్డర్లు ఇచ్చారు. దాంతోనే ఎలక్ట్రానిక్‌ జకాట్‌ పరికరాన్ని అమర్చాను. నా వద్ద అమర్చిన పరికరాన్ని చూసి ఆసక్తితో కొందరు శిక్షణ తీసుకున్నారు. మరికొందరు ఇలాంటి పరికరానికి ఆర్డర్లు ఇచ్చారు.

ఇదీ చదవండి: దిండులో పుస్తకం... చదువుకోవచ్చు, పడుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.