సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం గుండా ప్రవహించే కూడవెల్లి వాగు గడచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొర్లుతోంది. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాదాపు అన్ని వాగులు, వంకలు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుంటే... కూడవెల్లి వాగు మాత్రం తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వాగు నిండుకుండలా మారడం వల్ల కూడవెల్లి వాగు పరిసరాలన్నీ జల కళను సంతరించుకున్నాయి. ఈ కమనీయ దృశ్యాలను చూసేందుకు పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య