ETV Bharat / state

సిద్దిపేటలో రూ.7.50 లక్షలు సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు - police vehicle raids in siddipet

ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.7 లక్షల 50వేలను సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా నగదు దొరికినట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

siddipet traffic police vehicle raids
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు
author img

By

Published : Oct 13, 2020, 10:22 AM IST

దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ వాహనంలో రూ.7.50 లక్షల రూపాయలున్న సంచిని గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్పును కలెక్టర్​ ఆఫీసులో డిపాజిట్ చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. సంబంధిత వ్యక్తి ఆధారాలు చూపించి డబ్బు తీసుకెళ్లవచ్చవని చెప్పారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద రూ.50వేలకు మించి డబ్బు ఉండవద్దని, ఒకవేళ ఉంటే పక్కా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. వ్యాపారులు.. వ్యాపార లావాదేవీలు ఆన్​లైన్ ద్వారా చేసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.