సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తన సతీమణి రాజ్ ప్రతీపతో కలిసి వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ సంబురాల్లో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీసులు, వారి కుటుంబాలు పాల్గొన్నాయి.
పోలీసులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడటం చాలా ఆనందంగా ఉందని సీపీ జోయల్ డేవిస్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ చారిత్రక చిహ్నమని పేర్కొన్నారు. బతుకమ్మ పాటల్లో మహిళలు వారి కష్టసుఖాలను, స్నేహాన్ని, ప్రేమను, భక్తి, భయం, చరిత్ర, పురాణాలను మేళవించి ఆలపిస్తారని తెలిపారు.
![Batukamma festival at komati cheruvu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-75-22-policebathukamma-script-ts10058_22102020194721_2210f_1603376241_846.jpg)