ETV Bharat / state

​ రాఖీ బహుమతిగా మాస్క్​, శానిటైజర్ ఇచ్చిన మున్సిపల్​ ఛైర్మన్ - సిద్ధిపేట మున్సిపాలిటీ ఛైర్మన్​

రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీ కట్టిన సోదరికి పట్టుచీరనో, నగదో, బంగారమో.. తనకు తోచిన ఏదో ఒక బహుమతి ఇస్తారు. కానీ.. సిద్ధిపేట మున్సిపాలిటీ ఛైర్మన్​ ​ రాజనర్సు శానిటైజర్​, మాస్కులు బహుమతిగా ఇచ్చారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి, శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలనే సందేశాన్ని చెప్పకనే చెప్పారు.

Siddipet Municipal Chairman Gifted sanitizer and masks to his sister on raksha bandhan
​ రాఖీ బహుమతిగా మాస్క్​, శానిటైజర్ ఇచ్చిన మున్సిపల్​ ఛైర్మన్
author img

By

Published : Aug 3, 2020, 4:30 PM IST

​రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టిన సోదరీమణులకు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు శానిటైజర్​లు, మాస్కులు బహుమతిగా ఇచ్చారు. సోదరి క్షేమం కోరే సోదరుడిగా.. తన సోదరీమణులకు శానిటైజర్లు, మాస్కులు పంచినట్టు తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని మించిన విలువైన బహుమతి లేదని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజర్​ వాడాలని సూచించారు. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన శానిటైజర్ పంపిణీ చేశారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.