ETV Bharat / state

చెత్తే కదా అని తీసి పారేయ్యరు.. ఎరువుగా మార్చి చూపిస్తారు! - human interest story

భూమిపై పనికిరానిదంటూ ఏదీ ఉండదు.. అర్థవంతంగా ఉపయోగిస్తే.. పారేసే చెత్తకూడా ఎంతో విలువైనదిగా మార్చొచ్చని నిరూపిస్తున్నారు ఆ గ్రామస్థులు. ఒకానొక రోజుల్లో చెత్తగా విసిరేసిన వారే... దానితో ఎరువును తయారు చేసి.. మొక్కలకు అందిస్తున్నారు. వాళ్లు చేస్తున్న పనితో పదిమందికీ ఆదర్శమవుతున్నారు సిద్దిపేట జిల్లా మాల్యాల గ్రామస్థులు.

చెత్తే కదా అని తీసి పారేయ్యరు.. సేంద్రియ ఎరువుగా మార్చి చూపిస్తారు

author img

By

Published : Feb 10, 2021, 8:58 PM IST

Updated : Feb 11, 2021, 10:44 PM IST

చెత్తే కదా అని తీసి పారేయ్యరు.. ఎరువుగా మార్చి చూపిస్తారు!

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడలేదు ఆగ్రామస్థులు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరూ చెప్పనవసరం లేనప్పుడు.. ఊరుని శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరైనా చెప్పాలా... గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచే ఓ సర్పంచ్​ ఉంటే చాలు. గ్రామస్థుల్లో అవగాహన కల్పించి.. ఆలోచనను ఆచరణలో పెట్టి.. చెత్తపై పోరు జరిపి.. వ్యర్థమనుకున్న చెత్తను.. ఎంతో విలువైన ఎరువుగా మార్చి ఊరంటే ఇలా ఉండాలి అనే స్థాయికి తీసుకొచ్చారు మాల్యాల సర్పంచ్​ దరిపల్లి వజ్రమ్మ. వ్యర్థానికి సరికొత్త రూపాన్నిచ్చి... దాన్ని ఎరువుగా మార్చి... మొక్కలకు అందిస్తూ... అటు శుభ్రతను... ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మాల్యాల గ్రామస్థులు. గ్రామంలో మొక్కలకే కాదు.. పొరుగు గ్రామాలకు ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో మల్యాల గ్రామం ‘స్వచ్ఛ మల్యాల' దిశగా అడుగులు వేస్తోంది. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఉపాధిహామీ పథకం నిధులతో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధులతో గ్రామంలో డంపింగ్‌ యార్డు నిర్మించి.. చెత్త నుంచి సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేస్తున్నారు.

మంత్రి హరీశ్​రావు చూపిన బాటలో...

గతంలో అన్ని గ్రామాల్లాగానే మా గ్రామంలోను చెత్త సమస్య విపరీతంగా ఉండేది. మంత్రి హరీశ్​రావు సూచనలతో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు పూనుకున్నాం. గ్రామపౌరులందరికీ అవగాహన కల్పించి.. చెత్త నిర్వహణలో భాగస్వామ్యులను చేశాం. మా ఆలోచనకు మహిళా సంఘాలు తోడవడం వల్ల అనుకున్న లక్ష్యం సాధించాం. గ్రామంలో చెత్త అనేదే కనిపించకుండా చేస్తున్నాం. దరిపల్లి వజ్రమ్మ, గ్రామ సర్పంచ్​.

స్వచ్ఛ మాల్యాల కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన కల్పించాం. ప్రజల నుంచి ఇప్పటి వరకు సుమారు పది క్వింటాళ్ల ఎరువును తయారు చేశాం. మేము తయారు చేసిన ఎరువును ఇతర గ్రామాలకు కూడా ఇచ్చాం.

- హరీశ్​, ఎంపీటీసీ సభ్యుడు

తడి, పొడి చెత్త సేకరణపై పాలకవర్గం గ్రామస్థులందరికీ అవగాహన కల్పించింది. చెత్తను వేరువేరుగు వేసేందుకు ఇంటింటికీ బుట్టలు పంపిణీ చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్​ వ్యర్థాలను వేరు చేసి.. యూనిట్లకు తరలిస్తారు. అందులో వానపాములను వేసి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. దానినే మొక్కలకు అందిస్తున్నారు.

తగ్గిన ఎరువుల భారం

గ్రామంలో చేపట్టిన హరితహారం మొక్కల పెంపకానికి ఈ ఎరువునే వాడుతున్నారు. చెత్త నుంచి ఎరువు ఉత్పత్తితో గ్రామం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. ఎరువుల ఖర్చు తగ్గుతుంది. గ్రామంలో నాటిన హరితహారం మొక్కలతో పాటు పల్లె పకృతి వనాలకు ఈ ఎరువునే వాడుతున్నారు. పనికిరాని చెత్తని పాడేసిన వారే... సేంద్రియ ఎరువు ఉత్పత్తితో ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చివరిగా ఒక్కమాట...

ఇంటిని చూడు ఇల్లాళిని చూడు అన్నారు పెద్దలు. స్వచ్ఛతను చూడాలంటే మాల్యాల గ్రామాన్ని చూడు అనే స్థాయికి తీసుకురావడంలో గ్రామసర్పంచ్​ దరిపల్లి వజ్రమ్మ ఎంతో కృషి ఉంది. గ్రామస్థులను ఏకతాటిపై తెచ్చి... అనుకున్న లక్ష్యాన్ని ఆచరణ పెట్టి స్వచ్ఛతవైపు బాటలు వేస్తున్నారు మాల్యాల సర్పంచ్​. ఇటువంటి ఆలోచన ఉన్న ప్రజాప్రతినిధులు ఊళ్లకు కావాలి... అటువంటి ఊళ్లు దేశానికే ఆదర్శమవ్వాలి... ఇదే నిజమైన స్వచ్ఛతకు నిదర్శనం.

ఇదీ చూడండి: త్వరలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం: కేసీఆర్​

Last Updated : Feb 11, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.