సిద్దిపేట జిల్లా కోర మీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా ఉద్ధృతి కారణంగా భక్తులు లేకుండానే ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులతో శాస్త్రోక్తంగా కొనసాగించారు.
మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా, లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య జరిగిన బ్రహ్మోత్సవాల ముగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. ఆలయ అర్చకులు ఒగ్గు పూజారులు అగ్నిగుండాల ప్రవేశం చేశారు. అనంతరం అక్కడున్న కొద్దిమంది భక్తులకు అగ్నిగుండాల ప్రవేశం చేసేందుకు పోలీసులు అనుమతించారు.
ఇదీ చదవండి: ఓరుగల్లులో కేటీఆర్... మిషన్ భగీరథ ప్రారంభం..