Siddipet Dinosaur Park Opening : సిద్దిపేట కోమటి చెరువు కోటి అందాలకు నెలవుగా మారింది. మంత్రి హరీశ్ రావు కృషితో ఆరు నెలలకోసారి ఏదో ఓ కొత్త అందం కోమటి చెరువుపై అవిష్కృతమవుతోంది. తాజాగా దేశంలోనే డైనోసార్ జురాసిక్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రోజున మంత్రి హరీశ్ రావు ఈ పార్కును ప్రారంభించారు.
Minister Harish Rao Inaugurate Siddipet Dinosaur Park : డైనోసార్ అరుపులు.. చీకటి గుహలు.. రాక్షస బల్లుల భీకర ధ్వనులు.. కోమటి చెరువుకు మరో సరికొత్త అందాన్ని చేకూర్చాయి. రాక్ గార్డెన్లో రాక్షస బల్లుల విన్యాసం.. కదిలే డైనోసార్లు.. భయపెట్టే బల్లులు.. సిద్దిపేట జిల్లాలో కోమటి చెరువుపై నిలిపిన ఈ పార్క్.. పర్యాటకులకు మరో ఆకట్టుకునే పార్క్‌గా అలరించనుంది. రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌లతో వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ తీర్చిదిద్దారు. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, ఎన్నో మధురానుభూతులను కలిగించేలా ఈ పార్కు రూపుదిద్దుకుంది.
-
Dinosaur park , Komati Cheruvu Siddipet pic.twitter.com/waOUTdwcct
— TG (@gnanesh_) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dinosaur park , Komati Cheruvu Siddipet pic.twitter.com/waOUTdwcct
— TG (@gnanesh_) September 16, 2023Dinosaur park , Komati Cheruvu Siddipet pic.twitter.com/waOUTdwcct
— TG (@gnanesh_) September 16, 2023
దేశంలోనే అతిపెద్ద డైనోసార్ పార్క్ : దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ప్రసిద్ధి చెందనుంది. బెంబేలెత్తించే డైనోసార్లు.. చీకటి గుహల్లో రాక్షస బల్లుల విన్యాసం.. కదిలే డైనోసార్స్ ఉన్న తొలి డైనోసార్ థీమ్ పార్క్ కావడం గమనార్హం. గుజరాత్ సమీపంలోని రయోలిలో మొదటిసారిగా డైనోసార్ గుడ్లు లభించడంతో అక్కడ డైనోసార్ మ్యూజియం(Museum) ఏర్పాటు చేశారు. ఇందులో నిలకడగా ఉండే డైనోసార్‌లను ప్రదర్శనకు ఉంచారు. ఒక్కటి మాత్రం అరుస్తూ.. కదలికలు ఉండేలా ఏర్పాటు చేశారు. కానీ సిద్దిపేట పార్క్‌లో మాత్రం కదులుతున్న 18 డైనోసార్లు ఉంచారు. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్క్‌గా అవిష్కృతం కానుంది.
వేల ఏళ్లనాటి డైనోసార్ గుడ్డుపై రీసెర్చ్- ఏం తెలిసిందంటే...
Siddipet Dinosaur Park Specialties : ఈ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో చిన్న ట్రాక్‌ను నిర్మించారు. ఓ మినీ ట్రైన్ నడిచే విధంగా రూపొందించారు. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే కూర్చునేలా సదుపాయం కల్పించారు. ఈ ఓపెన్ ట్రైన్‌లో అతిధులు తిరుగుతున్న సమయంలో సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ పురాతన జీవుల గర్జనలు, కేకలు వినడానికి వీలుగా ఈ పార్క్ తెలివిగా నిర్మాణాలు చేశారు. ప్రదర్శనలో డైనోసార్ అస్థిపంజరాలు, వాటి గుడ్లు ఉన్నాయి, అన్నీ సిలికాన్ టెక్నాలజీని(Silicon Technology) ఉపయోగించి చేశారు.
డైనోసార్ థీమ్ డార్క్ రైడింగ్ పార్క్ ఇండియాలోనే మొదటగా నిర్మించింది ఇక్కడే. ఇందులో 8~10 నిమిషాల రైడ్ ఉంటుంది. ఈ రైడ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని వయస్సుల వారి దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఒక స్కేరీ రైడ్ అని చెప్పవచ్చు. టైమ్ జోన్ ట్రావెల్‌ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవే కాకుండా పెద్దపెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్‌ఫాల్స్(WaterFalls) ఇలా ఎన్నో రకాల హంగులతో శతాబ్దాల కిందట భూమి మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ సిద్దిపేటను మరో భూతల స్వర్గంగా రూపుదిద్దారు.