సీఎం కేసీఆర్(Kcr), మంత్రి హరీశ్ రావులు(Harish rao) సిద్దిపేటకు వచ్చిన ప్రతీసారి ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు(Pre-arrest) చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మండిపడ్డారు. సొంత జిల్లాలో పర్యటించడానికి..1250 మంది పోలీసుల పహారా ఎందుకని నిలదీశారు. అరెస్టుల ప్రక్రియ అప్రజాస్వామిక చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. పోలీసుల అదుపులో ఉన్న కాంగ్రెస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో మామాఅల్లుళ్ల నియంత పాలన నడుస్తోందని నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు గెలిచిన కేసీఆర్.. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వక పోగా వారిని నిర్బంధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు పర్యటనకు వస్తున్నట్లు తెలియగానే ముందు రోజు రాత్రి నుంచే ప్రతిపక్ష నాయకులపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: CM TOUR: కామారెడ్డిలో సీఎం పర్యటన... నూతన కలెక్టరేట్ ప్రారంభం