ETV Bharat / state

పకడ్బందీ ప్రణాళికతో జిల్లాలో హరితహారం కార్యక్రమం - haritha haram in siddipet

మరింత పకడ్బందీగా హరిత హారం కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ మొజాంమిల్ ఖాన్, జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు.

haritha haram program in siddipet
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి
author img

By

Published : Sep 29, 2020, 9:47 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనకు అనుగుణంగా, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లాలో హరిత హారం కార్యక్రమ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అధికారులతో సమావేశమైన వెంకట్రామ రెడ్డి.. జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటికి కావాల్సిన మొక్కల వివరాలను నమోదు చేయాలని సూచించారు.

siddipet collector venkat
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి

ఇంటి యజమాని సంతకంతో కూడిన నివేదికను రూపొందించాలని, ప్రతి ఇంట్లో కనీసం 6 మొక్కలకు తగ్గకుండా.. ఎన్ని మొక్కలు కావాలో సమాచారం సేకరించాలని తెలిపారు. ఈ వివరాలను అక్టోబర్ 5న తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న 2-3 సంవత్సరాలకు పకడ్బందీ ప్రణాళికతో మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.