ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి చెట్టుని రక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు తాను కోరిన మొక్కలను 50 శాతం అందిస్తామని తెలిపారు. ప్రతి మొక్కకు రూ.5 రూపాయలు, నిర్వహణ ఖర్చు అందిస్తామన్నారు. మండలాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీలు మండల స్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
- ఇదీ చూడండి : మాస్టర్ ప్లాన్ సమర్పించండి: హైకోర్టు ఆదేశం