రైతు వేదికల నిర్మాణాల్లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాం రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణాలు అనుకున్న స్థాయిలో పురోగతి సాధించాలంటే.. అధికారుల ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. నిర్మాణం పూర్తైన వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్ లు వినియోగంలోకి తీసుకురాకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
గజ్వేల్ లో రైతు వేదిక, డంప్ యార్డు, వైకుంఠ ధామం, పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం పలు అంశాలపై కలెక్టప్ సమీక్ష నిర్వహించారు. వానాకాలం పంట పూర్తయ్యేలోపు రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కచ్చితంగా ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి... పరిశీలిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతామని కలెక్టర్ చెప్పారు.