ETV Bharat / state

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ - సిద్ధిపేట జిల్లా వార్తలు

జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయన రెవెన్యూ, పౌర సరఫరాలు, సహకార, డీఆర్డీవో, వ్యవసాయ, రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Siddipet Collector Review meeting on Crops
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్‌
author img

By

Published : Oct 9, 2020, 1:28 PM IST

జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వానాకాలం సీజన్​లో 2 లక్షల 17వేల 272 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని వ్యవసాయ అధికారులు కలెక్టర్​కు తెలిపారు. ఈ సీజన్​లో మొత్తం 5లక్షల 49వేల543 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలు పెంచండి

వర్షాలు సమృద్ధిగా కురవడం, సాగునీటి లభ్యత పెరగడం వల్ల గతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌర సరఫరాల సంస్థ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఐకేపీ 190, పాక్స్ - 148, ఏఎంసీ- 14 మొత్తం 352 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో కొనుగోళ్లు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే రైతుల సౌకర్యార్థం మరో 50 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ మూడోవారం నుంచి పంట కోతకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా కోతకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కొనుగోళ్లు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించి త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు వీలుగా పౌర సరఫరాల సంస్థ వద్ద రూ.25 వేల కోట్లు అందుబాటులో ఉంచారని కలెక్టర్ తెలిపారు. పంట పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి.. అక్కడి నుంచి నేరుగా.. రైస్ మిల్లుల వద్దకు సజావుగా చేరేలా రెవెన్యూ, వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. ఇందు కోసం డివిజన్, మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఈవోలు రైతులు, వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, ఆరైవల్స్​పై చర్చించాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు.

రైస్​ మిల్లర్లు సహకరించాలి

ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు నాణ్యమైన, తేమ శాతం తక్కువగా ఉన్న, శుభ్రం చేసిన ధాన్యాన్ని తెచ్చేలా స్థానిక తహశీల్దార్​లు, వ్యవసాయ అధికారులు రైతు సమన్వయ సమితి సభ్యులతో క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నాణ్యత ప్రమాణాలు గురించి, ఎంఎస్పీ వివరాలు రైతులకు తెలిసేలా జిల్లాలోని 499 గ్రామ పంచాయతీలలో వచ్చే 5 రోజుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సదరు ఫ్లెక్సీలపై తహశీల్దార్, వ్యవసాయ అధికారి మొబైల్ నంబర్లను ముద్రించా లని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్ లు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని 115 మిల్లులకు సంబంధించి ప్రతి మిల్లుకు ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాల్సిన పూర్తి బాధ్యత డివిజన్ స్థాయిలో సంబంధిత ఆర్డీవోలదే అని కలెక్టర్ తెలిపారు. చక్కని ప్రణాళిక, సమన్వయంతో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎస్.పద్మాకర్, ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవోలు అనంత రెడ్డి , డీఎంసీఎస్ఎం జే హరీష్, గోపాల్ రావు, సివిల్ సప్లై, సహకార శాఖ అధికారులు, తహశీల్దార్లు, రైస్ మిల్లర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.