ETV Bharat / state

రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎస్సీఎస్టీ కమిషన్​​ ఛైర్మన్​ - సిద్దిపేట జిల్లా తాజా వార్త

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ,సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు.

scst chairman srinivas visit renuka yellamma talli temple at husnabad in siddipet district
రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎస్సీఎస్టీ కమిషన్​​ ఛైర్మన్​
author img

By

Published : Nov 11, 2020, 6:27 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని శ్రీరేణుక ఎల్లమ్మతల్లిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాన్ని చూడడం.. ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, మున్సిపల్ ఛైర్మన్ రజిత, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు.

ఇదీ చూడండి: తిరుమల టికెట్​ బుక్​ చేసుకుని దర్శనాలకు రాని భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.