సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఓ కుటుంబం గోదావరిఖనికి వెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. లాక్డౌన్ వల్ల బస్సు దొరకక.. తిరిగి ఇంటికి వెళ్లలేక అక్కడే ఉదయం నుంచి ఉన్నారు. బస్టాండ్‌లో సాయంత్రంపూట లైట్లు వేసేందుకు వచ్చిన ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్(RTC Controller) తిరుమల రావు.. ఆ కుటుంబాన్ని గమనించి ఆరా తీశారు.
గోదావరిఖని నుంచి పది రోజుల క్రితం జనగామ జిల్లా మచ్చుపహాడుకు పోయామని తిరుగు ప్రయాణంలో హుస్నాబాద్‌కు చేరుకున్నామని.. 10 గంటల తర్వాత లాక్డౌన్ కనుక గోదావరిఖనికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉండిపోయామని చెప్పారు. తినేందుకు తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికి కంట్రోలర్ తిరుమల రావు భోజనం పెట్టారు. కరోనా కష్టకాలంలో తమ ఆకలి తీర్చిన కంట్రోలర్‌కు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి : COVID vaccine: త్వరలో అందుబాటులోకి మరో టీకా!