సిద్దిపేట జిల్లా తొగుటలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జంటను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో భార్య ఘటనా స్థలిలోనే మృతి చెందగా... భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన మల్లేశం, అంజవ్వ దంపతులు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిత్యం టిప్పర్లు తిరగడం వల్ల రోడ్లన్నీ గోతులు ఏర్పడ్డాయని... దానికి తోడు టిప్పర్ డ్రైవర్లు వాహనాలను వేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఉపసర్పంచ్ కళ్లల్లో విషం దాడి.. పోయిన కంటి చూపు