సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో రెవెన్యూ అధికారులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వ్యాపారి నుంచి బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
మొక్కజొన్నలు నిల్వ చేసే దుకాణంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న స్థానిక రెవెన్యూ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించి 92 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ ఉంచిన వ్యాపారులు శ్రీనివాస్, నాగరాజులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తహసీల్దార్ తెలిపారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష