రాష్ట్రంలో నిరుపేదలైన రెడ్డి కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని రెడ్డి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్ల పరిష్కారానికై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు.
ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ భవనాలను ప్రభుత్వమే నిర్మించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తెలుగు రాష్ట్రాల్లో పది శాతం అమలు చేయాలన్నారు.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద రెడ్డి కులస్థులకు అందే విధంగా చూడాలన్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకోసం అర్హులైన వారికి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'