సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగజాతికి చెందిన మొక్కకు పూసిన పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది నాటిన తీగజాతికి చెందిన ఈ మొక్క ఈ ఏడాది పూలు పూసి అందరినీ ఆకర్షిస్తున్నది. అచ్చం రాఖీని పోలి ఉన్న ఈ పువ్వు రాఖీల పండుగ ముందు పూయడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాభారతంలో శ్రీ కృష్ణుడు ఈ రాఖీ పుష్పాన్ని చేతికి కట్టుకున్నట్టు చెప్తారు. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ రాఖీల కంటే.. ఈ రాఖీ పుష్పాలు బాగున్నాయని, మంచి సువాసన వస్తున్నాయని పలువురు అంటున్నారు. అన్నాచెల్లెల్ల బంధానికి ప్రతీకగా కట్టే రాఖీ స్థానంలో ప్లాస్టిక్ రాఖీకి బదులు.. పచ్చటి చెట్టుకు పూసిన రాఖీ పుష్పం ఉత్తమం అంటున్నారు స్థానికులు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్