గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సిద్దిపేట జిల్లాలో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అయితే అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలు.. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ మంగళవారం రాత్రి నుంచి మొదలై ఓ మోస్తరుగా కురుస్తోంది.
చెరువులు, కుంటల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని గ్రామాల్లో వర్షానికి ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి : తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు