Prakash Raj Met CM KCR: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం(ఫిబ్రవరి 26న) ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుపై ఎర్రవల్లిలోని నివాసంలో నాలుగు గంటలకు పైగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌లతో భేటీ సందర్భంగా తెరాస బృందంతో పాటు ప్రకాశ్ రాజ్ చర్చల్లో పాల్గొన్నారు. త్వరలో బెంగుళూరు, భువనేశ్వర్, దిల్లీ పర్యటనల గురించి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ నిర్వహించాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్‌రాజ్ మధ్యాహ్నం భోజనం చేశారు.
సీఎం కేసీఆర్ సూచన మేరకు మల్లన్నసాగర్, గజ్వేల్ సమీకృత మార్కెట్, కొండ పోచమ్మ సాగర్‌ను ప్రకాశ్‌రాజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే అగ్రగామిగా..
"రాష్ట్రంలో గజ్వేల్‌కు ప్రత్యేకత ఉంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అభివృద్ధితో పాటు వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో.. దేశంలోనే అగ్రగామిగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది" - ప్రకాశ్‌రాజ్, నటుడు
ఇదీ చూడండి: