రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. భారీగా చేరిన వరద నీటితో.. పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెక్‌డ్యామ్‌లు భారీ వర్షాలకు పూర్తిగా నిండి.. పొంగి పొర్లుతున్నాయి. నిండిన చెరువులు, చెక్‌డ్యామ్‌లు చూడడానికి చుట్టుపక్క ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.
ఇవీ చూడండి: భయం భయం: భాగ్యనగరంలో డెత్ స్పాట్లుగా మ్యాన్ హోళ్లు