దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ - వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
కరోనా వేళ ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సురక్షితంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి... ఓ జాబితా తయారు చేసింది. ఆ జాబితాలో ఉన్నవారితో ఓట్లు వేయించేందుకు 15 బృందాలను నియమించింది. వీరంతా ఆయా ఓటర్ల ఇంటికే వెళ్లి ఓటు వేయిస్తున్నారు. ఎవరైనా లేకపోతే... మరోసారి ఇళ్లకు వెళ్తున్నారు. ఓటరు చెంతకే ఓటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు.
దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్