సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. తమను వేధిస్తున్నాడంటూ నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రిన్సిపల్ మద్యం సేవించి కళాశాలకు వచ్చి... తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.
అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ... దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ని వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం