Political Heat in Dubbaka Assembly Constituency : సిద్దిపేట జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గమైన దుబ్బాకలో(Dubbaka Elections 2023).. రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇక్కడ ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. 2020లో అధికార పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పదవిలో ఉండగానే చనిపోవడంతో.. నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ తరఫున రఘునందన్ రావు, కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బరిలో దిగారు.
Telangana Assembly Elections 2023 : అయితే అత్యంత స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్(BRS)పై.. బీజేపీ పార్టీ తరఫున రఘునందన్‌రావు విజయం సాధించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి రఘునందన్ రావుకే టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి అధిష్ఠానం టికెట్ ఖరారు చేసింది. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలోని క్యాడర్‌ను ఎప్పటికప్పుడు కలుస్తూ.. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపి అభ్యర్థి రఘునందన్‌రావుకు ఓటేస్తే మళ్లీ 5 ఏండ్లు దుబ్బాక వెనక్కి పోతుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఖాయమని.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
Dubbaka Constituency Elections 2023 : మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. అధికార బీఆర్ఎస్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్ కుమార్, కత్తి కార్తీక రేసులో ఉన్నారు.
పార్టీ అంతర్గత సర్వేల్లో.. కాంగ్రెస్ అధిష్ఠానం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉంటే మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా ఓవరల్‌గా చూస్తే దుబ్బాకలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ తరుణంలో ఉద్యమ చైతన్యం కలిగిన నియోజకవర్గం కావడంతో బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దుబ్బాక నియోజకవర్గానికి నిధుల అంశం.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు