కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని వేములఘాట్ రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే రూ.21 వేల కోట్ల పనులు చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అనుమతులు పొందేవరకు పనులు ఆపేలా చూడాలని కోరారు.
కాళేశ్వరంపై ఎన్జీటీ ప్రధాన బెంచ్‌లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషన్ల విచారణపై స్పష్టత ఇవ్వాలని దిల్లీలోని ప్రధాన బెంచ్‌ను చెన్నై ఎన్జీటీ బెంచ్ కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది.