సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలం రాయిపోల్లో ఉత్తమ్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర మంత్రి వర్గంలో తెరాస ప్రభుత్వం ఎస్సీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదంటూ ఆరోపించారు. పదవుల విషయంలో తెరాస ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించడం లేదని వ్యాఖ్యానించారు.
గతంలో దుబ్బాక ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగిందని.. ఇప్పుడు అది జరగదని ఉత్తమ్ పేర్కొన్నారు. చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడించారు. రెండో స్థానం కోసమే తెరాస, భాజపా కొట్లాడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్